రాక్ష‌స‌బ‌ల్లుల‌ను నాశ‌నం చేసిన వాటిపై ప్ర‌తీకారం తీర్చుకోవాలి: ఎల‌న్ మ‌స్క్

భూమిపైన నివ‌శించిన అతి పెద్ద జంతువులు ఏవి అంటే రాక్ష‌స‌బ‌ల్లులు అని చెప్తాం.  కోట్ల సంవ‌త్సారాల క్రితం ఈ రాక్ష‌స‌బ‌ల్లులు అంత‌రించిపోయాయి.  ఉల్క‌లు భూమిని ఢీకొట్ట‌డం వ‌ల‌న జ‌రిగిన ప్ర‌మాదాల వ‌ల‌న డైనోసార్స్ అంత‌రించిపోయాయి.  ఆ త‌రువాత అడ‌పాద‌డ‌పా ఉల్క‌లు భూమీని ఢీకొడుతూనే ఉన్నాయి.  అయితే, మ‌నిషి ఆవిర్భ‌వించిన త‌రువాత టెక్నాల‌జీని అందుబాటులోకి తెచ్చుకున్నాక మ‌నిషి జీవ‌న విధానం పూర్తిగా మారిపోయింది. రాబోయే ప్ర‌మాదాల‌ను ముందుగానే ప‌సిగ‌డుతూ వాటిని ఎదుర్కొంటున్నాడు.  

Read: యూకే వైపు భార‌త విద్యార్థుల చూపులు… భారీగా పెరిగిన డిమాండ్‌…వీసా మ‌రింత ఆల‌స్యం…

కొన్ని సంవ‌త్స‌రాల్లో భూమిని ఢీకొట్టేందుకు అతిపెద్ద ఆస్ట్రాయిడ్ ఒక‌టి భూమివైపు వ‌స్తున్న‌ట్టు నాసా గుర్తించింది.  ఇది భూమిని చేరుకోక ముందే బ్లాస్ట్ చేసేందుకు నాసా డార్ట్‌ను ప్ర‌యోగించింది.  ఈ డార్ట్‌ను ఎల‌న్ మ‌స్క్‌కు కంపెనీకి చెందిన ఫాల్క‌న్ 9 రాకెట్ ద్వారా ప్ర‌యోగించారు.  నాసా ప‌రిశోధ‌న‌ల‌లో ఎల‌న్ మ‌స్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ భాగం పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే.  2022 చివ‌రినాటికి ఈ డార్ట్ త‌న టార్గెట్‌ను ఛేదిస్తుంది.  కాగా, దీనిపై ఎల‌న్ మ‌స్క్ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు.  భూమిపై నివ‌శించిన రాక్ష‌స‌బ‌ల్లుల‌ను నాశ‌నం చేసిన ఆస్ట్రాయిడ్స్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్‌పై నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.   

Related Articles

Latest Articles