భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్… వరివైపే రైతు మొగ్గు

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో గత ఏడాదిలాగే ఈసారి కూడా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. వరికి ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో.. రైతులు యథావిధిగా వరిని సాగుచేస్తున్నారు. దీంతో మరోసారి తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. యాసంగి పంటల విషయంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుటారని భావించినప్పటికీ.. వరినే సాగుచేయడంతో ఈసారి గణనీయంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఇప్పటికే వానాకాలం వరి విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళికను సైతం వ్యవసాయ శాఖ ప్రకటించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు రైతులు. అయితే ప్రతి ఏడాది వరి సాగు గణనీయంగా పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దానిలో భాగంగా గత సంవత్సరం జనవరి మొదటివారంలో 11 వేల 532 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగగా.. ఈసారి అది 11, 240 మెగావాట్లకు చేరింది.

Read Also: మంత్రి హరీష్‌ రావుని కలిసిన బాలకృష్ణ

తెలంగాణ రాష్ట్రంలో గత యాసంగిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా.. ఈసారి కూడా అంతే దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనలేమని స్పష్టం చేయడంతో.. రైతులు మొదట్లో కొంత గందరగోళనికి గురయ్యారు. ఆ తరువాత డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకోవాలని సర్కారు సూచించింది. ఇటు ప్రభుత్వం వరి కాకుండా ఇతర పంటలను వేయడం వల్ల వరి సాగు కంటే తక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుందని అధికారులు భావించారు. కానీ సర్కార్‌ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. ప్రత్యామ్నాయ పంటల వైపు కనీస ఆలోచన చేయలేదు రైతులు. ప్రభుత్వం రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది.

Related Articles

Latest Articles