విప‌ణిలోకి స‌రికొత్త సైకిల్స్‌: ఒక‌సారి చార్జింగ్ చేస్తే….

దేశీయంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మొగ్గుచూపుతున్నారు.  దేశీయంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  కాగా, కొంత‌మంది సైకిల్స్ కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.  ఇక టాటా ఇంట‌ర్నేష‌న‌ల్ అనుబంధ సంస్థ స్ట్రైడ‌ర్ సైకిల్స్ అర్బ‌న్ కమ్యూట‌ర్స్ రెండు ర‌కాల ఈ సైకిళ్ల‌ను విప‌ణిలోకి తీసుకొచ్చింది.  బ్యాట‌రీ ఆధారంగా ఈ సైకిళ్లు న‌డుస్తాయి.  వోల్టాక్ 1.7, కాంటినో ఈటీబీ 100 మోడ‌ళ్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ సైకిళ్ల‌కు సంబందించిన బ్యాట‌రీని ఒక‌సారి చార్జింగ్ చేస్తే గ‌రిష్టంగా 60 కిమీ ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.  స్మార్ట్ భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌తో వీటిని త‌యారు చేసిన‌ట్టు కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.  ఇందులో అమ‌ర్చిన 48 వీ లిథియం బ్యాట‌రీని మూడు గంటల్లో చార్జింగ్ చేసుకొవ‌చ్చు.  ఒక‌వేళ చార్జింగ్ అయిపోతే మామూలు సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్ల‌వ‌చ్చు.  

Read: హైద‌రాబాద్‌లో స్వ‌చ్చ‌మైన గాలి ఈ ప్రాంతాల్లోనే ల‌భిస్తుంది…

Related Articles

Latest Articles

-Advertisement-