తెలంగాణలో ‘హుజురాబాద్’ ఊపు పాయే..

టీఆర్ఎస్ పార్టీలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. హూజూరాబాద్ ఉప ఎన్నికను ఈటల రాజేందర్ తోపాటు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ పొలిటికల్ హీట్ మొదలైంది. కాంగ్రెస్ సైతం హుజురాబాద్ వేదికగా తమ సత్తా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ ఎన్నిక ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ ఉవ్విళ్లురుతున్నాయి.

హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉండగా టీఆర్ఎస్ నుంచి యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. అయితే పొలికల్ ప్రచారంలో మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు జోరు చూపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పాదయాత్ర చేపడుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేపడుతున్నారు. ఈక్రమంలోనే హూజురాబాద్ లో ఈటల వేవ్ కొనసాగుతుందనే టాక్ విన్పిస్తోంది.

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలను తీసుకున్నారు. బీజేపీకి ధీటుగా వ్యూహాలను రచిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో దళిత బంధును పైలెట్ ప్రాజెక్టు ప్రకటించి రాజకీయ వేడి రాజేశారు. అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలు టీఆర్ఎస్ కు ఓటేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ సైతం తన బలాన్ని చాటేందుకు ఉవ్విళ్లురుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకమైన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక కావడంతో ఇది ఆయన సామర్థ్యానికి పరీక్షగా మారనుంది. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

సెప్టెంబర్లోనే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. అయితే కరోనా సాకుతో కేంద్ర ఎన్నికల కమిషన్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికను వాయిదా వేసింది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా వాయిదా పడింది. వచ్చే నవంబర్ లేదంటే డిసెంబర్లో ఉప ఎన్నిక ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు ప్రచారం జోరు చూపిన పార్టీలన్నీ నిరుత్సాహానికి గురయ్యారు. ఎప్పుడో ఎన్నిక ఉంటే ఇప్పటి నుంచే ప్రచారం చేయడం ఎందుకు అని భావిస్తున్నాయి.

తెలంగాణలో ఖరీదైన ఉప ఎన్నికగా హుజురాబాద్ మారనునుంది. ఇలాంటి సమయంలో ఎన్నిక వాయిదా పడటంతో నేతలు పెద్దగా ఖర్చు పెట్టేందుకు ఇష్టపడటం లేదు. ఎన్నికల ముందు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ముందు జాగ్రత్తతోనే పార్టీల నేతలు ఇప్పుడు సైలంటైనట్లు తెలుస్తోంది. దీంతో హుజురాబాద్ లో కొంతకాలంగా ఉన్న ప్రచార ఊపుడు ఇప్పుడు కన్పించడం లేదనే టాక్ విన్పిస్తోంది. ఎన్నికల తేది వచ్చే నాటికి మళ్లీ ప్రధాన పార్టీలన్నీ జెట్ స్పీడుతో ప్రచారంలోకి దూసుకొస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-