ఎల‌న్ మ‌స్క్ ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్‌…

టెస్లా కార్ల ధిగ్గ‌జ వ్యాపారి ఎల‌న్ మ‌స్క్ స్పేస్ రంగంలోకి అడుగుపెట్టిన త‌రువాత త‌న‌దైన దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు.  ఇప్ప‌టికే ఎల‌న్ మ‌స్క్ కు సంబందించిన అంత‌రిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ నుంచి అంత‌రిక‌క్ష కేంద్రానికి స‌రుకుల ర‌వాణ‌, వ్యోమ‌గాముల చేర‌వేత వంటివి జ‌రుగుతున్నాయి.  అయితే, త్వ‌ర‌లోనే చంద్రునిపైకి వ్యోమ‌గాముల తీసుకెళ్లే కార్య‌క్ర‌మాన్ని నాసా రూపొందిస్తున్న‌ది.  దీనికి ఆర్టిమిస్ అనే పేరు పెట్టింది నాసా.  ఇందులో కీల‌క‌మైన కాంట్రాక్ట్‌ను ఎల‌న్ మ‌స్క్ ద‌క్కించుకున్నారు.  ఈ కాంట్రాక్ట్ విలువ 2.9 బిలియ‌న్ డాల‌ర్లు.  అదే విధంగా యూరోఫా చంద్రునిపై ఉన్న వాతావ‌ర‌ణం భూమిపై ఉన్న వాతావ‌ర‌ణానికి ద‌గ్గ‌ర పోలిక ఉంద‌ని, అక్క‌డ జీవ‌జాలం ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని నాసా భావిస్తోంది.  2024 లో నాసా ఓ ఉప‌గ్రహాన్ని ప్ర‌యోగించ‌బోతున్న‌ది.  దీనికి సంబందించిన కాంట్రాక్ట్‌ను కూడా ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సొంతం చేసుకుంది.  ఈ కాంట్రాక్ట్ విలువ 178 మిలియ‌న్ డాల‌ర్లు ఉండొచ్చ‌ని చెబుతున్నారు.  మొత్తానికి స్పేస్ రంగంలో ఎల‌న్ మ‌స్క్ సంస్థ దూసుకుపోతున్న‌ది. 

Read: కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్లిన మెగాస్టార్ దంపతులు

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-