ఈద్ కానుకగా ‘ఏక్ విలన్ రిటర్న్స్’!

హిందీ చిత్రాల దర్శక నిర్మాతలు గత రెండు రోజులుగా సెట్స్ పై ఉన్న తమ సినిమాలకు బెస్ట్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. దాదాపు ఇరవై మంది ప్రొడ్యూసర్స్ రిలీజ్ డేట్స్ ను లాక్ చేశారు. అయితే ఇప్పటికీ కొందరు తమ చిత్రాలను ఏ రోజున విడుదల చేస్తే, ఏ సమస్య వస్తుందో అని మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఈ విషయంలో దర్శకుడు మోహిత్ సూరి ఓ క్లారిటీకి వచ్చేశాడు.

జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, దిశా పటాని ప్రధాన పాత్ర ధారులుగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ఏక్ విలన్ రిటర్న్’ మూవీని ఈద్ కానుకగా 8 జూలై 2022 రోజున విడుదల చేయబోతున్నాడు. 2014లో శ్రద్ధాకపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, రితేశ్‌ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఏక్ విలన్’కు ఇది సీక్వెల్. ‘ఏక్ విలన్ రిటర్న్స్’ను తొలుత వచ్చే యేడాది ఫిబ్రవరి 11న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అనుకున్న సమయంలో చిత్రీకరణ పూర్తి కాలేదు. దాంతో ఇప్పుడీ సినిమాను ఈద్ టైమ్ కు పోస్ట్ పోన్ చేశారు. ‘ఈసారి ఈదీ విలన్ ను ఇవ్వబోతున్నామని, విడుదల తేదీ 8 జూలై 2022ను గుర్తుపెట్టుకోమ’ని కోరుతూ రిలీజ్ డేట్ పోస్టర్ ను జాన్ అబ్రహం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆడవాళ్ళు సైతం విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారని మోహిత్ సూరి తెలిపారు.

-Advertisement-ఈద్ కానుకగా 'ఏక్ విలన్ రిటర్న్స్'!

Related Articles

Latest Articles