30న రావడం లేదని చెప్పేసిన సంతోష్ శోభన్!

‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఇష్క్’ బాటలోనే ‘ఏక్ మినీ కథ’ కూడా సాగిపోతోంది. ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేయడం లేదంటూ హీరో సంతోష్‌ శోభన్ తో ఓ ఫన్నీ వీడియో ద్వారా తెలియచేశారు చిత్ర నిర్మాతలు. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. డస్ సైజ్ మేటర్స్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ‘ఏక్ మినీ కథ’లో సంతోష్‌ శోభన్ సరసన కావ్యథాపర్ నాయికగా నటించింది. ప్రవీణ్ లక్కరాజు మూవీకి సంగీతం అందించారు. కరోనా కారణంగా ఇప్పట్లో విడుదల లేదని, ఎప్పుడు విడుదల చేసే తర్వలో తెలియచేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. 

Related Articles

Latest Articles

-Advertisement-