టూరిజాన్ని గాడిలో పెట్టేందుకు ఆ దేశం కీల‌క నిర్ణ‌యం…

క‌రోనా కార‌ణంగా అనేక దేశాల్లో టూరిజం పూర్తిగా న‌ష్టపోయింది.  క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.  న‌ష్ట‌పోయిన ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను తిరిగి గాడిన పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి.  కొన్ని దేశాలకు ప‌ర్యాట‌క‌రంగం నుంచి అధిక‌మొత్తంలో ఆదాయం వ‌స్తుంది.  అలాంటి దేశాలు ప‌ర్యాట‌క రంగాన్ని తిరిగి గాడిలోకి తీసుకొచ్చేందుకు త్వ‌రిత‌గిన చర్య‌లు తీసుకుంటున్నాయి.  యూరోపియ‌న్ యూనియ‌న్ గ్రీన్ వీసా విధానాన్ని అమ‌లులోకి తీసుకురాగా, ఈజిప్ట్ ఈ వీసాను అమ‌లులోకి తీసుకొచ్చింది.  ఈజిప్టుకు ప‌ర్యాట‌కం నుంచే అధికఆదాయం ల‌భిస్తుంది.  క‌రోనా కార‌ణంగా దెబ్బ‌తిన్ని ప‌ర్యాకాన్ని పున‌రుద్ద‌ర‌ణ చేసేందుకు సిద్ధ‌మ‌యింది.  ఈ వీసా ప‌ద్ద‌తిలో వీసాల‌ను మంజూరు చేస్తున్న‌ట్టు ఈజిప్ట్ ప‌ర్యాట‌క శాఖ తెలియ‌జేసింది.  తాజాగా ఎల‌క్ట్రానిక్ టూరిస్ట్ వీసాల జాబితాలో మ‌రో 28 దేశాల‌ను చేర్చింది.  దీంతో ఈ వీసా జాబితాలో చేరిన దేశాల సంఖ్య 74 కి చేరింది.  

Read: ‘రెడ్ నోటీస్’… నెట్ ఫ్లిక్స్ లోకి ‘ద రాక్’ రాకింగ్ ఎంట్రీ!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-