ప్ర‌పంచంలో అత్యంత పురాత‌న‌మైన స‌మాధి అదే… సంద‌ర్శ‌న‌కు అనుమ‌తి…

ప్ర‌పంచంలో పురాత‌న‌మైన క‌ట్ట‌డాలు ఏవి అంటే పిర‌మిడ్‌లు అని చెప్తారు.  ఈజిప్ట్ లో ఉన్న ఈ పిర‌మిడ్ ల‌ను సంద‌ర్శించేందుకు ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి టూరిస్టులు వ‌స్తుంటారు.  ఇక ఈజిప్టు రాజ‌ధాని న‌గ‌రం కైరోకు ద‌క్షిణ ప్రాంతంలోని స‌క్కార పిర‌మిడ్ ఉన్న‌ది.  ఈ పిర‌మిడ్ లో 4700 సంవ‌త్స‌రాల నాటి స‌మాధి ఉన్న‌ది.  ఇది కింగ్ జోజ‌ర్ స‌మాధి.  క్రీస్తుపూర్వం 2667-2648 మ‌ధ్యాకాలంలో నిర్మించి ఉంటార‌ని చరిత్ర‌ను బ‌ట్టి తెలుస్తున్న‌ది.  కైరోను సంద‌ర్శించే టూరిస్టులు ఈ స‌మాధిని తప్ప‌కుండా సంద‌ర్శిస్తుంటారు.  అయితే, 2020 నుంచి మ‌ర‌మ్మ‌త్తులు చేస్తున్న కార‌ణంగా ఈ స‌మాధిని సంద‌ర్శించేందుకు అనుమ‌తులు ఇవ్వ‌లేదు.  కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఈజిప్టు ప్ర‌భుత్వం ఆంక్ష‌ల‌ను స‌డ‌లించింది.  దీంతో కింగ్ జోజ‌ర్ స‌మాధిని సంద‌ర్శించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది.  

Read: అమెరికా వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్న డెల్టా… తీవ్ర‌స్థాయికి కేసులు…https://ntvtelugu.com/increased-delta-variant-cases-in-us/

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-