సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి.. బీజేవైఎం పనే..

ప్రభుత్వానికి కొన్నిసార్లు ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతూనే ఉంటుంది.. ప్రజలు కాకపోయినా.. ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్‌ చేస్తూ.. కొన్ని అంశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇలా ప్రజా ప్రతినిధులతో పాటు.. కొన్నిసార్లు అధికారులను కూడా అడ్డుకోవడం, నిరసన వ్యక్తం చేయడం, ఆందోళన తెలపడం.. ఇక దాడులకు పాల్పడిన సందర్భాలు కూడా లేకపోలేదు.. తాజాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు బీజేవైఎం కార్యకర్తలు…

ఇవాళ పూరీ సిటీలో పర్యటించారు సీఎం నవీన్ పట్నాయక్‌.. శ్రీ జగన్నాథ్‌ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు వెళ్లి తిరిగి వెళ్తుండగా ఆయన దర్జీపోఖారీ ఛక్‌ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కోడిగుడ్లు విసిరారు.. కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. సీఎం ప్రయాణిస్తున్న కారు అద్దాలను కూడా ఈ కోడిగుడ్లు తాకాయి.. కాగా, హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్‌ మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు బీజేపీ కార్యకర్తలు.. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలను అడ్డుకున్నారు.. కోడిగుడ్లతో దాడులు కూడా చేశారు.. ఇక, ఈ దాడి తమపనిగా బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్‌ ఆచార్య ప్రకటించారు.. సీఎం పట్నాయక్‌ ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతామని వెల్లడించారు.

Related Articles

Latest Articles