నిధులు కేంద్రానివి, ఫోటోలు కేసీఆర్ వి : ఈటల ఫైర్

నిధులు కేంద్రానివి, ఫోటోలు కేసీఆర్ వి అని… ముఖ్యమంత్రి మాటలను ప్రజలు నమ్మేపరిస్థితి తెలంగాణ లో లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్‌ అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అనంతరం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినంద సభ లో ఈటల రాజేందర్ ను సన్మానించారు నేతలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ప్రజల సెంటిమెంట్ మీద ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది, పథకాలు, ప్రలోభాలకు గురి చేసిన హుజురాబాద్ ప్రజలు నన్ను హక్కున చేర్చుకున్నారన్నారు. తన గెలుపుతో కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని చురకలు అంటించారు. హుజురాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ 600కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రజల విశ్వసాన్ని పొందలేక పోయారని ఫైర్‌ అయ్యారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహించారు.

Related Articles

Latest Articles