కేసీఆర్‌ పతనం ఆరంభమైంది: ఈటల రాజేందర్‌

కేసీఆర్‌ అనాలోచితనిర్ణయం వల్ల రాష్ర్ట ఆర్థికస్థితి దిగజారిందని ఈట రాజేందర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. కేసీఆర్‌పై విమర్శల బాణాలను సంధించారు. పైరవీలు చేసుకున్న వాళ్లకే బిల్లులు చెల్లిస్తున్నార న్నారు. రైతు రుణ మాఫీలో 24వేల కోట్లలో 5వేల కోట్లు కూడా చెల్లిం చలేదు. ఒకవేళ ఇచ్చినా డబ్బు కేవలం రైతుల వడ్డీ కట్టాడానికే సరి పోయింది. ఒక రైతుబంధు ఇచ్చి రైతులకు రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సీడీ, ఫసల్‌ భీమా రాష్ర్ట వాటా కట్టలేదన్నారు. మీరిచ్చేది ఇస మెత్తు.. నష్టపోయేది అధికం. ఇప్పటికి కూరగాయాలు ఇంపోర్ట్‌ అవు తున్నాయి. కేసీఆర్‌ మంచిదయితే తనఖాతాలో వేసుకుంటాడు. చెడు అయితే మంది మీద తోస్తారు. 18 గంటలే కరెంటు ఇస్తున్నారు. పీక్‌ టైంలో ఐదు గంటలు కరెంటు ఇవ్వడం లేదు. ఉప్పుడు బియ్యం కొనమని కేంద్రం చెప్పింది. రా రైస్‌ ఎంతైనా తీసుకుంటామని కేంద్రం చెప్పింది.

ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అడ్డమైన అబద్ధాలు అన్ని కేసీఆర్‌ ఆడుతున్నాడు. సీడ్‌ విషయంలో కూడా హర్టీ కల్చర్, పాలీహౌజ్‌లు వేసుకున్న రైతులు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. షాట్ మెమోరీ ప్రజలకు ఉండొచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారన్నారు. నువ్వు మాట్లాడిన మాటలన్నీ ప్రజలకు గుర్తుం టాయి. కోటి టన్నుల పంట పండే అవకాశం ఉందని గతంలో కేసీఆర్‌ చెప్పారు.

ఇప్పుడు ఆ కోటి టన్నుల పంటను అమ్ముకునే మార్కెట్‌ నాడు లేదని కేసీఆర్‌కు సోయిలేదా అంటూ విమర్శించారు. కేంద్ర ప్రభు త్వానికి ధాన్యం కొనుగోలు విషయంలో మీరు ఏ రిపోర్ట్‌ అయితే ఇచ్చారో.. అదే కేంద్రం చేస్తోంది. హుజురాబాద్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టారు. అయినా ప్రజలు బీజేపీనే గెలిపించారు. హుజురాబాద్‌ ఎన్నికతో కేసీఆర్‌కు చెంప చెల్లుమంది. హుజురాబాద్‌ ఎన్నిక ఫలి తాన్ని ప్రజల దృష్టి మరల్చాలని చూసినా అది సాధ్యం కాదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ నిజంలో బతకాలని ఈటల రాజేందర్‌ అన్నారు.

Related Articles

Latest Articles