అధికారంపై ఉన్న యావ అభివృద్ధిపై లేదు: ఈటల రాజేందర్

టీఆర్ఎస్ ప్రభుత్వంపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విమర్శలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక లాంటి ఎన్నికలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నానని… ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు అన్నీ.. ఇన్నీ కాదని ఈటల ఆరోపించారు. రూ.వందల కోట్లను స్వయంగా పోలీసులే తీసుకొచ్చి పంచారని.. కమలాపూర్‌లో అయితే ఎల్లమ్మ దేవతపై ప్రమాణం చేయించి డబ్బులు పంచారని ఈటల విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో హుజురాబాద్ ప్రజలు అదే ఫలితాన్ని ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో తాను ఔట్ సోర్సింగ్ ద్వారా 22 మందికి ఉద్యోగాలు కల్పిస్తే వారందరినీ తీసేశారని.. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న వాళ్లను మాత్రం ఉద్యోగాల్లో ఉంచారని ఈటల వ్యాఖ్యానించారు.

Read Also: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా

టీఆర్ఎస్ పార్టీకి అధికారంపై ఉన్న యావ అభివృద్ధి, రైతులపై లేదని ఈటల ఆరోపించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని… కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకోమని.. రా రైస్ ఇవ్వాలని స్పష్టంగా సూచించారని ఈటల వివరించారు. తెలంగాణలో ఒక్క రైస్ క్లస్టర్ కూడా లేదని.. .దీని వల్ల రైతు క్వింటాల్‌కు రూ.140 వరకు నష్టపోతున్నారని తెలిపారు. సజ్జలు, రాగులు వంటి పంటలు పండించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగం ఉసురు పోసుకోకుండా ఉండాలంటే తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉందని ఈటెల పేర్కొన్నారు.

Related Articles

Latest Articles