జులై 1 నుంచి విద్యా సంస్థ‌లు ప్రారంభం

తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల త‌గ్గుముఖం, లాక్‌డౌన్ ఎత్తివేత‌తో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్ర‌భుత్వం విద్యాశాఖను ఆదేశించింది. శ‌నివారం స‌మావేశమైన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. విద్యా సంస్థలు ప్రారంభం అయినప్పటి నుంచి విద్యార్థులు, సిబ్బంది కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ పలు సూచనలు చేసింది. కాగా తెలంగాణలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని కాసేపటి క్రితమే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-