గుడ్ న్యూస్‌: త‌గ్గుతున్న వంట‌నూనె ధ‌ర‌లు…

పండుగల వేళ కూర‌గాయ‌లు, ఇత‌ర నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతుంటే, వంట‌నూనె ధ‌ర‌లు మాత్రం త‌గ్గుముఖం ప‌ట్టేఅవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  వంట‌నూనె ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు కేంద్రం సుంకాల‌ను త‌గ్గించింది.  పామాయిల్‌, పొద్దుతిరుగుడు, సోయాబీన్ నూనెల‌పై బేసిక్ క‌స్ట‌మ్స్ సుంకాన్ని ర‌ద్దు చేసిన‌ట్టు కేంద్ర ప‌రోక్ష ప‌న్నులు క‌స్ట‌మ్స్ బోర్డు ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.  వ్య‌వ‌సాయ సెస్ లో కోత విధించ‌డంతో మూడి నూనె ధ‌ర‌లు దిగి వ‌స్తున్నాయి.  లీట‌ర్‌కు రూ.12 నుంచి రూ.15 వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్టుగా నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  బేసిక్ క‌స్ట‌మ్స్ సుంకాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు 32.5శాతం ఉండ‌గా, దాన్ని 17.5 శాతానికి త‌గ్గించింది.  దీంతో నూనెల ధ‌ర‌లు భారీగా త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ది.  త‌గ్గించిన క‌స్ట‌మ్స్ సుంకం విధానం ఈరోజు నుంచి అమ‌ల్లోకి రానున్న‌ది.  మార్చి 31 వ‌ర‌కు అమ‌లులో ఉంటుంది.  నూనె ధ‌ర‌లు త‌గ్గ‌డంతో సామాన్యుడికి కొంత ఊర‌ట ల‌భించిన‌ట్టే అని చెప్పొచ్చు. 

Read: పెరిగిపోతున్న ప్రపంచం అప్పులు…

-Advertisement-గుడ్ న్యూస్‌:  త‌గ్గుతున్న వంట‌నూనె ధ‌ర‌లు...

Related Articles

Latest Articles