టాలీవుడ్ డ్రగ్స్ కేసు : మొదలైన రానా విచారణ

2017 డ్రగ్ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నేడు ఉదయం రానా ఈడీ ముందు హాజరయ్యారు. ఈ విచారణకు రానా ఆడిటర్ సతీష్ తోపాటు అడ్వకేట్ తో వచ్చారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసులో రానాపై విచారణ కొనసాగుతోంది.

రానాను ముగ్గురు సభ్యుల బృందం విచారిస్తున్నట్టు తెలుస్తోంది. 2015 -17లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ను రానా అధికారులకు సమర్పించారు. అందులో రెండు బ్యాంకు అకౌంట్లకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చారు. రానా బ్యాంకు అకౌంట్లను ఈడి బృందం పరిశీలిస్తోంది. ఇప్పటికే రానాకు సంబంధించిన రెండు బ్యాంక్ అకౌంట్ లకు సంబంధించిన స్టేట్మెంట్ లను ఈడీ తెప్పించుకుంది. రానా అకౌంట్ నుంచి కొన్ని అనుమానిత ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బులు బదలాయింపు చేయడంపై ఈడి ఈ విచారణలో ఆరా తీయబోతోంది.

డ్రగ్స్ ఆరోపణలపై పలు సందర్భాల్లో మాట్లాడిన రానా డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని, బాలీవుడ్‌తో సంబంధాలు, తరుచూ పార్టీలకు వెళ్తుండడంతో తనకు డ్రగ్స్ అలవాటు ఉందని ప్రచారం జరుగుతోందని, సినిమా వాళ్లు డ్రగ్స్ తీసుకుంటే తనకేం సంబంధం అని ప్రశ్నించారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. పిల్లలకు డ్రగ్స్ సరఫరాపై ప్రభుత్వం కఠినంగా ఉండాలి అని రానా గతంలో అన్నారు. మరి ఈడీ విచారణలో ఏం తేలనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also : శంకర్, చరణ్ పాన్ ఇండియా మూవీ లాంచ్

నిన్న నటుడు నందు, డ్రగ్ డీలర్ కాల్విన్ మాస్కరేన్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంగళవారం ఉదయం నందు ఈడి కార్యాలయానికి రాగా ఎనిమిది గంటలకు పైగా ఆయనను ప్రశ్నించారు. వాస్తవానికి సెప్టెంబర్ 20న విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. కానీ ముందుగానే నందును ఎందుకు విచారించారు అన్నది ఇంకా తెలియరాలేదు. ఇక ఆయనను ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ వివరాల గురించి అడిగినట్లు సమాచారం.

పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత గత వారంలో అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో రానా దగ్గుబాటి, రవితేజ, ముమైత్ ఖాన్, నవదీప్, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ పేర్లతో సహా 10 మంది ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపింది.

మరో వైపు ప్రధాన నిందితుడు కాల్విన్ మస్కరేన్‌హాస్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అబ్దుల్ వాహెద్, అబ్దుల్ ఖుద్దూస్‌ని కూడా ఈడీ అధికారులు విచారించారు. కొంతమంది టాలీవుడ్ ప్రముఖులతో వారు జరిపిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించారు. 2017లో కస్టమ్స్ అధికారులు కాల్విన్ మస్కరేన్హాస్, మరో ముగ్గురిని అరెస్టు చేయడంతో డ్రగ్ రాకెట్ బయటపడింది. ఆ సమయంలో వారి వద్ద నుంచి 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-