ఎంపి నామా కంపెనీలు, నివాసాలపై 13 గంటలుగా ఈడీ సోదాలు

ఎంపి నామ నాగేశ్వరరావు కంపెనీలు, నివాసాలపై ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు 13 గంటల పాటు కొనసాగిన సోదాలు.. ఖమ్మం, హైదరాబాద్ తో పాటూ ఆరు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మదుకాన్ కంపెనీలో పలు రాంచీ ప్రాజెక్టు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ.. జూబ్లీహిల్స్ లో నామా నాగేశ్వరరావు సమక్షంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమంగా నిధులు మళ్ళీంచారని మని ల్యాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసింది ఈడీ. కొద్దిసేపటి క్రితం డబ్బులు లెక్కపెట్టే మిషన్ ను లోపలికి తీసుకెళ్లిన ఈడీ అధికారులు… నామ నివాసంలో పెద్ద ఎత్తున నగదు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. ఈరోజు రాత్రి వరకు ఈడీ అధికారుల సోదాలు జరపనున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-