వ‌చ్చే ఏడాది ఖైర‌తాబాద్‌లో ఎకో ఫ్రెండ్లీ గ‌ణ‌ప‌తి…

ప్లాస్ట‌ర్ ఆప్ ప్యారిస్ విగ్రహాల‌ను హుస్సేన్ సాగ‌ర్‌లో నిమ‌జ్జ‌నం చేసేందుకు హైకోర్టు అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తోంది.  అందుబాటులో ఉన్న కుంట‌ల్లో విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేసే కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతోంది.  వినాయ‌క చ‌వితికి ముందునుంచే న‌గ‌ర‌పాల‌క సంస్థ మ‌ట్టి గ‌ణ‌ప‌య్య‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌చారం చేసింది.  దీంతో న‌గ‌రంలో చాలా మంది ఎకో ఫ్రెండ్లీ గ‌ణ‌ప‌తుల‌ను ఏర్పాటు చేసుకున్నారు.  అయితే, ఇప్పుడు ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తిని ఎక్క‌డ నిమ‌జ్జ‌నం చేయాలి అనేదానిపై ప్ర‌భుత్వం, అధికార‌లు సుమాలోచ‌న‌లు చేస్తున్నారు.  ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి ఉత్స‌వ క‌మిటీతో చ‌ర్చ‌లు జ‌రిపారు.  వ‌చ్చే ఏడాది మ‌ట్టి గ‌ణ‌ప‌తిని ఏర్పాటు చేయాల‌ని కోరారు.  అందుకు ఉత్స‌వ క‌మిటీ కూడా అంగీక‌రించిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  70 అడుగుల ఎత్తైన మ‌ట్టి గ‌ణ‌ప‌య్య‌ను ఏర్పాటు చేసేందుకు మ‌హాగ‌ణ‌ప‌తి ఉత్స‌వ క‌మిటీ ఒప్పుకుంద‌ని అధికారులు పేర్కొన్నారు.  

Read: అమెరికా వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్న డెల్టా… తీవ్ర‌స్థాయికి కేసులు…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-