ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై ఈసీ కీలక సమావేశం

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల ప్రకటించింది. 7 దశల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. అయితే కరోనా కేసులు దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు నిర్వహించడం ఈసీకి సవాల్‌గా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నిల ప్రచారంపై ఈసీ కీలక సమావేశం నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో కేంద్ర కార్యాలయంలో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు సమావేశమయ్యారు. అంతేకాకుండా కరోనా ఉధృతి దృష్ట్యా ఈసీ పార్టీలకు పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. భౌతికదూరం, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై ఈసీ చర్చించనుంది. ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించాక ఈసీ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Related Articles

Latest Articles