ఐదు రాష్ట్రాలు ఎన్నిక‌లు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న‌

తాజాగా దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డంపై కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. కోర్టులు కూడా సీరియ‌స్‌గా కామెంట్లు చేశాయి… అయితే, త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మ‌రో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు తాము సిద్ధ‌మంటూ సీఈసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగియ‌నుండ‌గా.. ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంది.. అస‌లే ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ ఇంకా త‌గ్గ‌నేలేదు.. మ‌రోవైపు.. థ‌ర్డ్ వేవ్ అంటూ కొత్త టెన్ష‌న్ ఉండ‌నే ఉంది.. కానీ, ఆ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని సీఈసీ సుశీల్ చంద్ర.. ఓ ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించారు.. కోవిడ్ వ్యాప్తి కొన‌సాగుతోన్న స‌మ‌యంలో.. పశ్చిమ బెంగాల్, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, పుద్దుచ్చేరితో పాటు బీహార్ లాంటి రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉందని పేర్కిన్న ఆయ‌న‌.. సెకండ్‌ వేవ్ ప్ర‌స్తుతం తగ్గుముఖం పడుతోందని, త్వరలోనే అది అంతమవుతుందని చెప్పుకొచ్చారు. కాబట్టి వచ్చే ఏడాది నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఆ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. మ‌రి.. అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో అనేది వేచిచూడాల్సిన విష‌యం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-