మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్‌తో అనుసంధానం… ఇలా చేయండి…

మీ మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్‌తో లింక్ చేయ‌లేదా… లింక్ చేయ‌కుంటే అనేక బెనిఫిట్స్‌కు కోల్పోవాల్సి ఉంటుంద‌ని ఇప్ప‌టికే మెసేజ్‌లు వ‌స్తుంటాయి.  మొబైల్ ఫోన్‌ను ఆధార్‌కు జత చేయాల‌ని అంటే ఇప్పుడు ఆధార్ సెంట‌ర్‌కు వెళ్లి గంట‌ల త‌ర‌బ‌డి ఉండాల్సిన అవ‌స‌రం లేదు.  మీరే స్వ‌యంగా ఆధార్‌ను లింక్ చేసుకొవ‌చ్చు.  అందుకోసం ask.uidai.gov.in  లింక్‌ను ఓపెన్ చేసి అందులో మీరు న‌మోదు చేయాలి అనుకున్న కొత్త మొబైల్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి.  ఆనంత‌రం మీ మొబైల్‌కు ఓటీపి వ‌స్తుంది.  ఆ ఓటీపితో లాగిన్ కావాలి. అప్‌డేట్ ఆధార్ అనే ఆప్ష‌న్‌లోకి వెళ్లి మీరు ఇచ్చిన మొబైల్ నెంబ‌ర్ కింద ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి.  ఆనంత‌రం వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి సేవ్ అండ్ ప్రోసెస్ చేయాలి.  త‌రువాత ఆధార్ ఆప్డేట్ కోసం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.  ఆ మొత్తాన్ని ఆధార్ సెంట‌ర్‌లో చెల్లించాలి.  దానికోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకొని సెంట‌ర్‌కు వెళ్లి చెల్లించాలి.  

Read: ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : రగులుతున్న జల వివాదం

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-