శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్ల బయటే జనం పడిగాపులు

శ్రీకాకుళం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. మంగళవారం రాత్రి జిల్లాలోని ఇచ్చాపురంలో నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు కవిటి, కంచిలి మండలాల్లోనూ భూమి కంపించింది. గత వారం రోజులలో రెండోసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read Also: ఒక ఇంటికి ఒకటే మీటర్.. ఈ మ్యాటర్ వర్కవుట్ అవుతుందా?

ఇచ్చాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని రత్తకర్ణ, తేలుకుంచి, అమీన్‌సాహిబ్‌ పేట, పురుషోత్తపురం గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి మూడుసార్లు కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు గాఢనిద్రలో ఉండగా భూప్రకంపనలు రావడంతో కొందరు భయంతో నిద్ర మానుకుని ఇంటి బయట పడిగాపులు కాశారు.

Related Articles

Latest Articles