తెలంగాణలో భూప్రకంపనలు.. ఆ 2 జిల్లాల్లో పరుగులు పెట్టిన ప్రజలు..!

తెలంగాణలో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి… ఇవాళ మధ్యాహ్నం వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌, వికారాబాద్‌ జిల్లాలోని మర్పల్లి మండలాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.. ఇక, ఊహించని ఘటనలో భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.. దమసాపూర్‌, భుచ్చన్‌పల్లి, మర్పల్లి గ్రామల్లో కూడా భూమి కంపించినట్టు చెబుతున్నారు.. ఇక, ఈ సమయంలో భూమి నుంచి భారీ శబ్ధాలు వచ్చినట్టు తెలుస్తోంది.. భూమి కింది భాగంలో కదలిక రావడంతో పొలాల మధ్య ఉన్నవారు కూడా భయాందోళనకు గురయ్యారు. కాగా, గతంలో, హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలోనూ భూమి నుంచి భారీ శబ్ధాలతో.. భూమి స్వల్పంగా కంపించిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ సంభవించిన భూప్రకంపనలు.. ఎంత తీవ్రతతో వచ్చాయి అనేది తెలియాల్సి ఉంది.

Read Also: ఏపీలో వైఎస్‌ షర్మిల పార్టీ..? మేమంతా ఒక్కటే అంటున్న ఏపీ మంత్రి

Related Articles

Latest Articles