నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి…ప‌రుగులు తీసిన జ‌నం…

నెల్లూరు జిల్లాలో భూమి స్వ‌ల్పంగా కంపించింది.  భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాంధోళ‌న‌ల‌కు గుర‌య్యి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.  దాదాపు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.  నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడులో ఈ ఘ‌ట‌న జరిగింది. స్వ‌ల్పంగా మాత్ర‌మే భూమి కంపించ‌డంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గలేదు.  అధికారులు భూమి కంపించ‌డానికి గల కార‌ణాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  నెల్లూరు జిల్లాలో  భూకంపాలు చాలా అరుదుగా మాత్ర‌మే వ‌స్తుంటాయి.  స‌ముద్ర‌తీర ప్రాంతం కావ‌డంతో ఈ జిల్లాకు వాన‌లు, వ‌ర‌ద‌ల ఎఫెక్ట్ ఎక్కువ‌గా ఉంటుంది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-