విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు

బతుకమ్మ, దసరా పండులను పురస్కరిచంఉకుని బుధవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17 వ తేదీ వరకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్‌. ఇక తిరిగి ఈ నెల 18న పాఠశాలలు పున ః ప్రారంభం కానున్నాయి. ఇక అటు ఇంటర్‌ కళాశాలలకు ఈ నెల 13 వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనుంది ఇంటర్‌ బోర్డు. 13 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. ఇక 17 వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా.. కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలు.. సెప్టెంబర్‌ 1 వ తేదీన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

-Advertisement-విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు

Related Articles

Latest Articles