నేటి నుంచే ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం..

విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయ్. ప్రతీఏటా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఐతే…కోవిడ్ పరిస్థితులతో…ఆంక్షల నడుమ ఏర్పాట్లు చేశారు. రోజుకు గరిష్టంగా 10 వేల మందికి దర్శనం దక్కేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం మాదిరిగా టైం స్లాట్ ప్రకారముగా రోజుకు పదివేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం వెబ్‌సైట్‌లోకి వెళ్లి దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవా టిక్కెట్లను మొత్తం కెపాసిటీలో 50 శాతం మాత్రమే కోవిడ్ నిభంధనల మేరకు అనుమతిస్తారు.

ఆన్‌లైను టిక్కెట్టు లేకుండా వచ్చే భక్తులకు, అసౌకర్యం లేకుండా వి.ఎం.సి.ఆఫీసు, టోల్‌గేటు, ఓమ్ టర్నింగ్ వద్ద, పున్నమి ఘాట్ వద్ద కరెంటు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అన్ని క్యూ మార్గాల్లోను రోజుకు 3సార్లు సోడియం హైపో క్లోరైడ్‌తో స్ప్రే చేస్తారు. క్యూమార్గంలో శానిటైజేషన్తో పాటు ధర్మల్ గన్స్‌తో చెక్ చేసిన తరువాతే భక్తులను అనుమతిస్తున్నారు.

దేవస్థానంలో ప్రస్థుతం 150 సెక్యూరిటీ సిబ్బంది వారికి అదనముగా 150 మంది సిబ్బందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. 3 వేల మంది పోలీసులతో దసరా ఉత్సవాలకు భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.మరోవైపు…దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబందనలను పాటించాలని అధికారులు సూచించారు. 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదని స్పస్టంచేశారు. కోవిడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లపైనా సిబ్బంది సూచనలను పాటించాలని తెలిపారు పోలీసులు.

-Advertisement-నేటి నుంచే ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం..

Related Articles

Latest Articles