సంక్రాంతి బరిలో చేరిన మరో స్టార్ హీరో..?

ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలు లైన్ కట్టిన సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, బంగార్రాజు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేమి ఈ సంకాంతి బరిలో లేవనే చెప్పాలి. ఇక ఈ సంక్రాంతికి నేను కూడా ఉన్నాను అంటూ ఎంటర్ అయిపోయాడు మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ కి మళయాళంలోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక గతేడాది ‘కనులు కనులు దోచాయంటే’ డబ్బింగ్ చిత్రంతోనే దుల్కర్ మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాడు.

ఇక తాజాగా ఈ సంక్రాంతికి సెల్యూట్ చిత్రంతో రాబోతున్నాడు. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 14 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో దుల్కర్ నిజాయితీ గల పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. మరి దుల్కర్ తెలుగులో సంక్రాంతి హీరోగా మారాతాడో లేదో చూడాలి.

Related Articles

Latest Articles