దుల్కర్ సల్మాన్, పీసీ శ్రీరామ్ తో ఆర్. బాల్కీ సైకలాజికల్ థ్రిల్లర్…

సౌత్ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో బాలీవుడ్ మూవీకి సిద్ధమవుతున్నాడు. గతంలో ‘కార్వాన్, ద జోయా ఫ్యాక్టర్’ వంటి సినిమాలు చేశాడు మన మల్లూ యాక్టర్. అయితే, ఇప్పుడు డైరెక్టర్ ఆర్. బాల్కీ మూవీలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకూ రియలిస్టిక్ టచ్ ఉండే సెన్సిబుల్ సినిమాలు తీసిన బాల్కీ తొలిసారి థ్రిల్లర్ జానర్ ట్రై చేయబోతున్నాడట. లాక్ డౌన్ కాలంలో ఆయన ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేసినట్లు సమాచారం. తన కథకి దుల్కర్ పక్కాగా సరిపోతాడని భావించిన ఆయన జూనియర్ మమ్ముట్టీని ఒప్పించాడట. తాజాగా ఇదే సినిమాకి తాను కూడా పని చేయబోతున్నట్టు టాప్ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ప్రకటించాడు. ఆయన ట్విట్టర్ ఖాతాలో ‘నా నెక్ట్స్ మూవీ బాల్కీతో చేయబోతున్నాను. అందులో దుల్కర్ నటించనున్నాడు. బాల్కీ, దుల్కర్ మూవీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్…’ అని రాశాడు. నెటిజన్స్ లో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా కరోనా ఉధృతి తగ్గి పరిస్థితులు చక్కబడ్డ వెంటనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-