ఐదు భాషల్లో దుల్కర్ సల్మాన్ ‘కురుప్’

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కురుప్’. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనలానే ఉన్న ఓ వ్యక్తిని హత్య చేసి పారిపోయిన గోపాలకృష్ణ కురుప్ జీవితం ఆధారంగా కె.ఎస్. అరవింద్, జితిన్ జోస్, డేనియల్ సయోజ్ నాయర్ ఈ కథను రాశారు. గతంలో దుల్కర్ సల్మాన్ తో ‘సెకండ్ షో’ మూవీ తెరకెక్కించిన శ్రీనాథ్‌ రాజేంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. టొవినో, సన్నీ వేన్, పృథ్వీరాజ్ సుకుమారన్, షైన్ టామ్ ఛాకో, శోభిత ధూళిపాల, మనోజ్ బాజ్ పాయ్, మాయా మీనన్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. సుషిన్ శ్యామ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను నిజానికి మే నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ ను నవంబర్ 12 మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు.

Related Articles

Latest Articles