ఒమిక్రాన్ ఎఫెక్ట్… మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్

దేశంలో ఒమిక్రాన్ కారణంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టాక కొన్ని ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ ముప్పు పెరుగుతుండటంతో ఆయా సంస్థలు మళ్లీ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశాయి. సోమవారం నుంచే కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయటం ప్రారంభించగా… బుధవారం నుంచి మరికొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇదే విధంగా సూచించినట్లు తెలుస్తోంది.

Read Also: కాకినాడ కాజాకు అరుదైన గుర్తింపు

ఐటీనే కాకుండా దేశంలోని ఇతర రంగాలకు చెందిన పలు సంస్థలు కూడా ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని ఇస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన పలు వ్యాపార సంస్థలు కూడా తాజా పరిణామాల దృష్ట్యా తమకు అనువైన చర్యలను తీసుకుంటున్నాయి. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ముప్పు ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని.. మనదేశంలో కూడా అలాగే జరుగుతుందని ఆశిస్తున్నట్లు పలు వ్యాపార సంస్థలు వాపోతున్నాయి. అటు ఉద్యోగులు కూడా కరోనా భయంతో ఆఫీసులకు రావడానికి జంకుతున్నారని పలు సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

Related Articles

Latest Articles