వైర‌ల్‌: దుబాయ్ షేక్ నోట అచ్చ తెలుగు పాట‌… నెట్టింట వైరల్‌…

తెలుగు పాట‌ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే.  భాష తెలియ‌కున్నా సంగీతాభిమానులు క‌మ్మ‌నైన తెలుగు పాట‌ల‌ను నేర్చుకొని ఆల‌పిస్తుంటారు. అటువంటి పాట ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెంట్ అవుతున్న‌ది.  కె విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో కేవీ మ‌హ‌దేవ‌న్ సంగీత సారథ్వంలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి క‌లం నుంచి జాలువారిన ‘విధాత త‌ల‌పున‌…’ అనే పాట ఎంత హిట్ అయిందో చెప్ప‌క్క‌ర్లేదు.  లెజెండ్ సింగర్ ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆల‌పించిన ఈ పాట‌ను ఇప్పుడు దుబాయ్‌కు చెందిన ఓ షేక్ పాడి వినిపించారు.  టిక్‌టాక్ కోసం పాడిన ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది.  సంగీతంపై ఆయ‌న‌కున్న మక్కువ‌ను తెలియ‌జేసింది. సంగీతానికి భాషాబేధాలు లేవ‌ని, నేర్చుకోవాల‌నే త‌ప‌న ఉంటే చాలని నిరూపించాడు దుబాయ్ షేక్‌.  

Read: భ‌ళా పంజాబ్ సీఎం: ఒక‌వైపు పాల‌న‌… మ‌రోవైపు వంట‌…

Related Articles

Latest Articles

-Advertisement-