పోలీసులను చూసి పరుగులు తీసిన డీఎస్పీ.. అసలు విషయం ఇది..

పోలీసు డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీ అంటే మంచి ర్యాంకే.. ఆయనకు ఎక్కడికి వెళ్లినా తగిన గౌరవం, హోదా లభిస్తాయి.. అయితే, పోలీసులను చూసి ఓ డీఎస్పీ పరుగులు పెట్టారు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోయే ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి రూ.11 లక్షలతో ఓ డీఎస్పీ పరుగులు తీశాడు.. తిరుచ్చి పుదుక్కొట్టై ప్రధాన రోడ్డు అయిన ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో వాహనాల తనిఖీ కేంద్రం ఉండగా.. అక్కడ గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును నిలిపి తనిఖీ చేస్తుండగా, కారులో నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి పరుగులు పెట్టాడు..

అయితే, ఇది గమనించిన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు.. పరిగెత్తిన వ్యక్తి డీఎస్పీ అని, స్నేహితులతో కలిసి రూ. 11 లక్షల నగదును తీసుకొని తిరుచ్చికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన సదరు డీఎస్పీ.. తనిఖీ కేంద్రంలో మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి తాను విజిలెన్స్‌ అధికారులు అనుకున్నానని.. డబ్బుకు తగిన ఆధారాలు లేకపోవడంతో పరిగెత్తినట్లు పేర్కొన్నారు. దీంతో డీఎస్పీతో పాటు అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. మరి విజిలెన్స్‌ అనుకుని పరుగులు పెట్టిన డీఎస్పీకి ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అనేదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Related Articles

Latest Articles

-Advertisement-