కేటీఆర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డీఎస్పీ

గత నెల 24న ఓ సంగీతాభిమాని ఓ యువతి పాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమె ప్రతిభను గుర్తించమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేశాడు. ఆ వీడియో చూసి ఇంప్రస్ అయిన కేటీఆర్… దాన్ని ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, తమన్ లకు ట్యాగ్ చేశారు. విశేషం ఏమంటే.. దేవిశ్రీ ప్రసాద్ వెంటనే తప్పకుండా ఆమెకు తగిన గుర్తింపు కలిగేలా చేస్తానని బదులిచ్చాడు. అంతేకాదు… ఆ విషయాన్ని కాస్తంత సీరియస్ గానే తీసుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో డీఎస్పీ తమిళ ఛానెల్ లో ‘స్టార్ టూ రాక్ స్టార్’ అనే కార్యక్రమం చేస్తుండటం కలిసొచ్చింది.

మెదక్ జిల్లాకు చెందిన శ్రావణి వివరాలు సంపాదించి, ఆమెను చెన్నయ్ కు తీసుకెళ్లి అక్కడి తన షోలో పాల్గొనేలా చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఈ విషయాన్ని అతనే స్వయంగా కేటీఆర్ కు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ‘డియర్ కేటీఆర్ సార్… నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. టాలెంటెడ్ సింగర్ శ్రావణిని చెన్నై తీసుకెళ్ళి మా ‘స్టార్ టు రాక్ స్టార్’లో ‘లైమ్ లైట్ రౌండ్’లో పాల్గొనేలా చేశాను. ఆమె అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆదివారం రాత్రి 7.30కి జీ తమిళ్ లో చూడండి’ అని ట్వీట్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ ను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. మరి గాయని శ్రావణికి రాబోయే రోజుల్లో తెలుసు సినిమాల్లోనూ పాటలు పాడే అవకాశం లభిస్తుందేమో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-