ఇంకా సందిగ్ధంలోనే ‘దృశ్యం 2’?

విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా నటించిన ‘నారప్ప’ చిత్రం ఓటీటీలో విడుదల అయినా సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దృశ్యం 2’ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ‘నారప్ప’ మాదిరిగానే ‘దృశ్యం 2’ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్మాతల ఆలోచనగా తెలుస్తోందని ప్రచారం జరుగుతోంది. దసరా తర్వాత ‘దృశ్యం 2’ స్ట్రీమ్ కానుందని బలంగానే వినిపిస్తున్న.. చిత్రయూనిట్ మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉందట.

‘నారప్ప’ సినిమాకు ఓటీటీలో ఊహించినంత రెస్పాన్స్ రాకపోవడంతోనే ‘దృశ్యం 2’ నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. థియేటర్ & ఓటీటీ లెక్కలను బేరీజు వేసుకుంటున్నారట. పైగా ‘దృశ్యం’ సినిమా హిట్ కొట్టడమే కాకుండా.. వెంకటేష్ కెరీర్ లో చాలా రోజుల తరువాత మంచి వసూళ్లను రాబట్టుకొంది. దీంతో దృశ్యం 2 సినిమాను థియేటర్లోనే తీసుకొస్తే బాగుండదని నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం థియేటర్లకు అభిమానుల రెస్పాన్స్ కూడా బాగానే ఉండటంతో ఆ రకమైన ఆలోచనలో ఉన్నారట. దీనిపైనా అతిత్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మలయాళ మూలకథను తెరకెక్కించిన జీతూ జోసెఫ్, తెలుగులోనూ దృశ్యం 2 సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆంటోని పెరంబవూర్.. రాజ్ కుమార్ సేతుపతితో కలిసి సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెంకటేష్ సరసన మీనా నటించగా.. నదియా కీలక పాత్రలో నటిస్తోంది.

-Advertisement-ఇంకా సందిగ్ధంలోనే ‘దృశ్యం 2’?

Related Articles

Latest Articles