చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసు లో భారీగా డ్రగ్స్ పట్టివేత…

చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసు లో మరోసారి భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. విదేశాలకు వెళుతున్న పార్శిల్ లో భారీగా డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల తో పాటు గాంజా గుర్తించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. చెన్నై నుండి అమెరికా, కెనడా వెళుతున్న 8 పార్శిల్ లో 7990 ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్‌లు, 1225 గ్రాముల గంజాయి ప్యాకెట్ల ఆధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా అక్రమ మార్గాల ద్వారా ఇండియా నుండి విదేశాలకు డ్రగ్స్ ను కేటుగాళ్లు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నై పోస్టాఫీసు లో విదేశాలకు వెళుతున్న పార్శిల్స్ పై కస్టమ్స్ అధికారుల నిఘా పెట్టారు.

ఢిల్లీ కి చెందిన ఓ స్మగ్లర్…. చెన్నైనుండి అమెరికా కు ఆరు పార్శిల్ ద్వారా డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి డ్రగ్స్ ను యోగా మసాజ్ బాల్స్ తో పాటు వెజిటేబుల్ సలాడ్ మిక్సర్ లో దాచి తరలించే యత్నం చేసిన కేటుగాడు. అమెరికా, కెనడా వెళుతున్న పార్శిల్ లను క్షుణ్ణంగా స్కానింగ్ చేసిన కస్టమ్స్ అధికారుల బృందం. పార్శిల్ లో డ్రగ్స్ గుట్టును రట్టు చేసిన కస్టమ్స్ ఆధికారులు..డ్రగ్స్ తో పాటు గాంజా స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. డ్రగ్స్ అక్రమ రవాణా NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దంధా పై కూపి లాగుతున్న కస్టమ్స్. అసలు పార్శిల్ బుక్ చేసిన వ్యక్తి ఎవరు? అమెరికా, కెనడా కు వెళుతున్న పార్శిల్ పై వున్న చిరునామా ఆధారంగా వివరాలు స్వేకరిస్తున్న అధికారులు.

: Ramesh Vaitla

-Advertisement-చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసు లో భారీగా డ్రగ్స్ పట్టివేత...

Related Articles

Latest Articles