బంజారాహిల్స్ లో డ్రగ్స్ పట్టివేత…

బంజారాహిల్స్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు. 30 గ్రాముల MDMA ,LSD 4 బోల్ట్స్ ,50 గ్రాముల చరాస్ , 10 కేజీల గంజాయిని అధికారులు సీజ్ చేసారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు. అరెస్ట్ అయిన ముగ్గురు శివశంకర్, మనికాంత్, శిల్పా రాయ్ గా తెలిపారు. అయితే శిల్పా రాయ్ వెస్ట్ బెంగాల్ కు చెందిన మహిళగా గుర్తించిన అధికారులు… వారి దగ్గర నుండి 2 బైక్స్, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన అధికారులు… ఈ డ్రగ్స్ వీరి దగ్గరికి ఎలా వచ్చాయి… బయటి నుండి వీటిని నగరంలోకి ఎలా తెచ్చారు… అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-