డ్రగ్స్ కేసు: పూరి జగన్నాథ్ విచారణ అప్డేట్స్

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్‌ ను ఉదయం నుంచి 5 గంటలుగా ఈడీ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. పూరి జగన్నాథ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ని అధికారులు పరిశీలిస్తున్నారు. 2015 నుండి అకౌంట్ స్టేట్మెంట్ లను పరిశీలిస్తున్నారు. చార్టెడ్ అకౌంట్ సమక్షంలో ఈడీ అధికారులకు పూరి జగన్నాథ్ వివరిస్తున్నారు. మరిముఖ్యంగా బ్యాంక్ లావాదేవీల పైనే దృష్టి సారించిన ఈడీ.. విదేశీ లావాదేవీలను ఆరా తీస్తున్నారు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పూరినీ విచారించే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-