డ్రగ్స్ నిందితులపై బిగుస్తున్న ఉచ్చు.. ఇళ్లలో ఐటీ సోదాలు

డ్రగ్ కేసులో ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. తాజాగా డ్రగ్స్ నిందితుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించారు. కెల్విన్, కుద్దిస్, వాహిద్ ఇళ్లలో ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహించింది. ఈమేరకు ముగ్గురు నిందితుల్ని ఈడీ కార్యాలయంకు అధికారులు తరలించారు. ముగ్గురిని వేరువేరుగా పెట్టి ఈడీ విచారణ చేస్తోంది. ముగ్గురు నిందితులు ఇళ్లల్లో లాప్ టాప్, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైస్ లని స్వాధీనపరుచుకున్నారు.

ఉదయం 6 గంటలకు నిందితుడు కెల్విన్ ఇంటికి వెళ్ళిన సిఆర్ఫీఎఫ్ పోలీసులు.. ఈడీ విచారణకు రావాలని కెల్విన్ ను సిఆర్ఫీఎఫ్ సిబ్బంది కోరింది. నోటీస్ పై మొదట సంతకం చేసేందుకు కెల్విన్ నిరాకరించారు. సంతకం చేసి విచారణకు వెళ్లాలని కెల్విన్ భార్య సూచించింది.

మధ్యాహ్నం 2:10 కి కెల్విన్ ను ఈడీ కార్యాలయానికి సిఆర్ఫీఎఫ్ సిబ్బంది తీసుకొచ్చింది. కెల్విన్ ఇంటికి సిఆర్ఫీఎఫ్ తో పాటు ఈడీ అధికారులు వెళ్లారు. కెల్విన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. దాదాపు నాలుగు గంటల పాటు కెల్విన్ ఇంట్లో సోదాలు చేశారు. కెల్విన్ ల్యాప్ టాప్ తో పాటు కెల్విన్ మొబైల్, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. మెహిదిపట్నం నుండి మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంటి నుండి 2 మొబైల్ ఫోన్ లతో పాటు ల్యాప్ టాప్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-