నేడు ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్

డ్రగ్స్‌ కేసులో నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నేడు ఈడీ ముందుకు రానున్నారు. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు రకుల్‌ ఈడీ ముందు హాజరు కానున్నారు. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ ని సెప్టెంబర్ 6న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీకి లేఖ రాసింది. మరో డేట్ ఇవ్వాలని అధికారులకు విన్నవించుకున్నారు. రకుల్ రిక్వెస్ట్ ని ఈడీ అధికారులు రిజెక్ట్ చేశారు. ఇవాళే విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పారు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే అకాశాలున్నాయి.

Read Also : మణిరత్నంపై కేసు నమోదు

ఇప్పటికే డ్రగ్స్ కేసులో నటి ఛార్మి విచారణ ముగిసింది. సుమారు 10 గంటల పాటు ఛార్మిని ఈడీ అధికారులు విచారించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు.. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఛార్మిపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. ఛార్మి మొబైల్‌లో కెల్విన్ చాటింగ్‌ వివరాలపై కూపీ లాగారు.

నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పుడు దీనిపై విచారణ జరిపిన ఎక్సైజ్ శాఖ.. కేసుతో సంబంధం ఉన్న ప్రముఖులను సుదీర్ఘంగా విచారించింది. తాజాగా ఈ కేసును ఈడీ టేకప్ చేసింది. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ చట్టం కింద 12 మంది సెలెబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. వీరిలో పూరి జగన్నాథ్, చార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానుంది. ఇక ఈనెల 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు శ్రీనివాస్, 13న నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-