రేపు ఈడీ ముందుకు నటుడు నవదీప్.. ఎఫ్‌ క్లబ్‌ పార్టీలపైనే ఈడీ ఫోకస్!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ నుండి రవితేజ, ఛార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరసగా విచారణ సాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతున్నట్లు తెలుస్తుంది. రేపు నటుడు నవదీప్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ముందు హాజరుకానున్నారు. కాగా, ఇదే రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌కు సైతం ఈడీ అధికారులు ఇప్పటికే సమన్లు జారీ చేశారు.

ఎక్సైజ్ కేసులో గతంలో నవదీప్ విచారణకు హాజరైయ్యారు. గతంలో 11 గంటల పాటు నవదీప్ ను ఎక్సైజ్ శాఖ విచారించింది. పిఏంఎల్ఏ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో మళ్ళీ తెరపైకి నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మనీలాండరింగ్ కేసులో విచారణతో పాటుగా ఎఫ్‌ క్లబ్‌ పార్టీలపైనా.. కెల్విన్ తో జరిపిన డ్రగ్స్ లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు సినీ ప్రముఖులను విచారించిన ఈడీ అధికారులు.. రేపు నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ ను విచారించనుండటంతో ఆసక్తిగా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-