డ్రగ్స్ కేసు: ఈడీ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ నేడు విచారణకు హాజరయ్యారు. 8 గంటలకు పైగా పూరిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీల పైనే దృష్టి సారించిన ఈడీ.. విదేశీ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే తాజాగా నిర్మాత బండ్ల గణేష్ హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. పూరి-బండ్ల గణేష్ గతంలో కొన్ని సినిమాలకు కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఆ బాండింగ్ తోనే బండ్ల.. పూరి విచారణ అనంతరం రిసీవ్ చేసుకోవడానికి కార్యాలయానికి వచ్చారు.

అయితే డ్రగ్స్ కేసు లిస్ట్ లోని బండ్ల గణేష్ ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమైయ్యే సరికి అంత షాక్ అయ్యారు. అటు సోషల్ మీడియాలోనూ బండ్ల గణేష్ డ్రగ్స్ కేసు విచారణకు హాజరైనట్లు ప్రచారం చేశారు. దీంతో తాజాగా బండ్ల స్పందిస్తూ.. ‘నాకు ఎవరు నోటీసులు ఇవ్వలేదు.. పూరి కోసం ఇక్కడికి వచ్చాను.. నాకెందుకు నోటీసులు ఇస్తారు’ అంటూ బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.

Related Articles

Latest Articles

-Advertisement-