ఎఫ్ క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ వ్యవహారం

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు పూరీ, ఛార్మి మరియు రకుల్ విచారణ ఎదుర్కొనగా ఈడీ అధికారులు తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకొన్నారు. అయితే ప్రస్తుత డ్రగ్స్ కేసులో ఎఫ్ క్లబ్ వ్యవహారాలు బయటపడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఎఫ్ క్లబ్ చుట్టూ డ్రగ్స్ వ్యవహారం తిరుగుతోంది.

ఎఫ్ లాంజ్ లో భారీగా పార్టీలు జరుగుతుంటాయి. నవదీప్ చెందిన ఎఫ్ లాంజ్ పబ్బు 2015 నుంచి 2018 వరకు వీకెండ్ లో నిత్యం పార్టీలు జరుగుతున్నాయి. నవదీప్, రకుల్, రానా దగ్గుపాటి, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కలిసి పార్టీ నిర్వహించినట్లుగా గుర్తించారు. పూరీ, ఛార్మిలు కలిసి పలుమార్లు ఎఫ్ లాంజ్ పబ్ లో పార్టీలు ఇచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ కి పెద్ద మొత్తంలో నిధులు బదలాయింపులు జరిగాయని అధికారులు గుర్తించారు. అయితే డ్రగ్స్ వ్యవహారం బయటికి రాగానే పంపిణీ మరొకరికి నవదీప్ అప్పగించారు.

ఇక ఈ నెల 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతో పాటు శ్రీనివాస్, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-