కాశ్మీర్‌లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం…

జ‌మ్మూకాశ్మీర్‌లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం సృష్టించింది.  కాశ్మీర్‌లోని అర్ణియా అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద డ్రోన్ సంచ‌రించిన‌ట్టు ఇండియ‌న్ ఆర్మీ తెలియ‌జేసింది.  అంత‌ర్జాతీయ స‌రిహద్దులో ఉన్న సాయ్ గ్రామానికి స‌మీపంలో ఈ డ్రోన్ వ‌చ్చిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో 200 మీట‌ర్ల  భార‌త్ భూభాగంలోకి డ్రోన్ వ‌చ్చింద‌ని, వెంట‌నే భ‌ద్ర‌తా సిబ్బంది కాల్పులు జ‌రిపార‌ని అధికారులు తెలిపారు.  డ్రోన్ కోసం భ‌ద్ర‌తాసిబ్బంది గాలింపు చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు.  గూఢ‌చ‌ర్యం లేదా ఆయుధాల‌ను గాని జార‌విడిచి ఉండొచ్చ‌ని అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Read: ట్రైలర్ : అదరగొట్టేసిన “నారప్ప”

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-