హైదరాబాద్ లో ప్రముఖులకు కారు చిచ్చు…

హైదరాబాదులో ప్రముఖులకు కారు చిచ్చు తగిలింది. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న కారులకు భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుండి కారులు దిగుమతి చేసుకునే రాయబారులకు పన్ను నుండి మినహాయిoపు ఉంటుంది. రాయబారులను ఆసరాగా తీసుకుని విచ్చలవిడిగా విదేశాల నుండి కార్లు దిగుమతి చేస్తుంది ముంబై మాఫియా. విదేశాల నుండి వస్తున్న కార్లు ముంబై నుండి మణిపూర్ లో ఓ మారుమూల షో రూంలో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రాయబారులు పేరుతో చెల్లించాల్సిన పన్ను ఎగొట్టెందుకు ముఠా ప్లాన్ చేస్తుంది. ఏడాది కాలంలో ఇరవైకి పైగా కార్లు దిగుమతి అయ్యాయి.

అయితే ముంబై ముఠా నుండి వస్తున్న కార్లు ఎక్కువ శాతం హైదరాబాద్ ప్రముఖులే కోనట్టు అభియోగం ఉంది. దాంతో రంగంలోకి దిగ్గారు డిఅర్ఐ అధికారులు. హైదరాబాద్ లో కోటి రూపాయలు కు పైగా కార్లు కల్గి ఉన్న రాజకీయ నాయకులు, సినీ తారలు,వ్యాపారవేత్తల్లో ముంబై ముఠా తో చేతులు కలిపి కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలు బయటికి తీస్తున్నారు డిఅర్ఐ అధికారులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-