డ్రగ్స్ కేసులో 8 మంది అరెస్ట్

గుజరాత్ డ్రగ్స్ కేసులో 8 మంది అరెస్ట్ అయ్యారు. 3004 కిలోల హెరాయిన్ ను డిఆర్ఐ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. కాందహార్ నుంచి ఇరాన్ మీదుగా గుజరాత్ కు హెరాయిన్ కంటైనర్ చేరుకున్నారు. నలుగురు ఆఫ్గాన్ దేశస్థులుతో పాటు ముగ్గురు భారతీయులు మరొకరు ఉజ్బెకిస్తాన్ వ్యక్తినీ అరెస్ట్ చేశారు. సుధాకర్ దంపతులతో పాటు మరొక ఇద్దరిని చెన్నై లో డిఆర్ఐ అరెస్ట్ చేసింది.

టాల్కమ్ పౌడర్ పేరుతో ఈ ముఠా స్మగ్లింగ్ చేస్తోంది. కంటిన్యూస్ టాల్కమ్ పౌడర్ జంబో బ్యాగులను ప్యాక్ చేసిన ముఠా.. డ్రగ్స్ ను గుర్తుపట్టకుండా ఉండేందుకు టాల్కమ్ పౌడర్ బస్తాల్లో మత్తు మందు దిగుమతి చేస్తోంది. విజయవాడ చెందిన ఆషీ ట్రేడింగ్ పేరుతో కన్సైన్మెంట్.. డ్రగ్స్ దిగుమతి వెనుకాల ఢిల్లీకి చెందిన కుల్దీప్ సింగ్ పాత్ర ఉందని డిఆర్ఐ తేల్చింది.

గుజరాత్ ముందా పోర్ట్ లో కంటైనర్ పట్టుకున్నాక దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూరు , కోయంబత్తూర్, మాండ్వి, గాంధీ ధామ్, విజయవాడలో సోదాలు డిఆర్ఐ నిర్వహించింది. ఢిల్లీ గోదాంలో 16 కిలోల హెరాయిన్ ను డిఆర్ఐ స్వాధీనపరుచుకుంది. నోయిడాలో 11 కిలోల కొకైన్ ను డిఆర్ఐ అధికారులు స్వాధీనపరుచుకున్నారు.

-Advertisement-డ్రగ్స్ కేసులో 8 మంది అరెస్ట్

Related Articles

Latest Articles