డీఆర్డీవో 2 డీజీ ఔషధం ధ‌ర ప్ర‌క‌ట‌న‌..

దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. వ్యాక్సినేష‌న్‌పై ఫోక‌స్ పెట్టింది స‌ర్కార్.. మ‌రోవైపు వ్యాక్సిన్ల కొర‌త వేధిస్తోంది.. ఆ క‌ష్టాల‌కు చెక్ పెట్టేందుకు విదేశీ వ్యాక్సిన్ల‌కు కూడా అనుమ‌తి ఇచ్చింది భార‌త్.. త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ క‌ష్టాలు తీరిపోనున్నాయి.. మ‌రోవైపు.. కరోనా బాధితుల చికిత్స కోసం డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధాన్ని ఇప్ప‌టికే విడుద‌ల చేసింది కేంద్రం… ఇక‌, ఇవాళ పొడి రూపంలో ఉండే 2-డీజీ ఔష‌ధం ధ‌ర‌ను ఫిక్స్ చేశారు.. ఈ ఔషధం ఒక్కో సాచెట్‌ ధర రూ.990గా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది..

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్‌ ధరకు అందజేయనున్నట్లు తెలిపారు.. మ‌రి, ఆ డిస్కౌంట్‌ ఎంత అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ర‌క్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ సంయుక్తంగా 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్‌ (2-డీజీ) ఔషధాన్ని త‌యారు చేసిన సంగ‌తి తెలిసిందే.. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌, ఆరోగ్య మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కొన్ని రోజుల క్రితం ఈ పౌడ‌ర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే కాగా, అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే ఈ ఔషధానికి అనుమ‌తి కూడా ఇచ్చింది. ఈ పౌడ‌ర్‌ను నీటిలో కలుపుకొని తాగాల్సి ఉంటుంది.. కరోనా రోగుల చికిత్సకు ఇది సురక్షితమని, రోగులు దవాఖానల్లో చేరే అవకాశాల్ని తగ్గిస్తుందని, ఆక్సిజన్‌పై ఆధారపడుతూ చికిత్స తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుందని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-