ఎన్టీఆర్ కి బాబాయ్ గా స్టార్ హీరో..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో ఈ హీరో ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాల వైపు ద్రుష్టి సారించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మిక్కినేని సుధాకర్ తో కలిసి హీరో నందమూరి కల్యాణ్ రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకున్న ఈ సినిమా.. క్యాస్టింగ్ ని వెతికే పనిలో పడ్డారంట. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ పాత్ర ఉన్నట్లే ఈ సినిమాలోనూ ఒక కీలక పాత్రను రాసుకున్నాడట కొరటాల.. ఆ పాత్ర కోసం ఒక సీనియర్ హీరోని ఎంపిక చేయడానికి తంటాలు పడుతుండగా చివరికి టాలీవుడ్ యాంగ్రీయంగ్ మ్యాన్ డా. రాజశేఖర్ ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్ గా రాజశేఖర్ కనిపించనున్నారట.

రాజశేఖర్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గానే వుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చర్చలు కూడా అయిపోయాయని, రాజశేఖర్ సైతం పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల ఏప్రిల్ నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడట. ఇక ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందొ తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే. ఒక వేళ ఇదే కనుక నిజమైతే యాంగ్రీ హీరో రాజశేఖర్ ని, యంగ్ టైగర్ తారక్ ని కొరటాల ఎలా చూపిస్తాడో చూడాలి.

Related Articles

Latest Articles