విడుదల సన్నాహాల్లో ‘డోన్ట్ బ్రీత్’ సీక్వెల్!

2016లో విడుదలైన ‘డోన్ట్ బ్రీత్’ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఫెడెరికో అల్వారెజ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమౌతోంది. ప్రేక్షకుల అభిమానంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్న ‘డోన్ట్ బ్రీత్’ సీక్వెల్ ను ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నారు. చిత్ర యూనిట్ చెబుతున్న దానినిబట్టి… గుడ్డివాడైన కథానాయకుడు ఈ సీక్వెల్ లో ఓ ఫైర్ యాక్సిడెంట్ లో తన వాళ్ళను కోల్పోయిన ఓ అమ్మాయి చేరదీస్తాడు. ఆమెకు అన్నీ తానై పెంచుతాడు. అయితే కొందరు కిడ్నాపర్స్ ఆ యువతి కిడ్నాప్ చేస్తారు. వారి చెర నుండి ఆ అనాధను హీరో ఎలా రక్షించాడన్నదే ఈ సీక్వెల్ లోని ప్రధానాంశమట. ‘డోన్ట్ బ్రీత్ 2’ చిత్రాన్ని రోడో సయాగుస్ డైరెక్ట్ చేయగా, తొలి చిత్ర దర్శకుడు ఫెడెరికో అల్వారెజ్ దీనికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మూవీ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకోవడంతో వారంతా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-