“దొంగలున్నారు జాగ్రత్త” అంటున్న కీరవాణి తనయుడు

కీరవాణి కుమారుడు సింహా కోడూరి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మత్తు వదలరా, తెల్లవారితే గురువారం వంటి విభిన్నమైన చిత్రాలతో అలరించిన సింహా ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకోవడానికి జాగ్రత్తగా ప్రాజెక్టులను ఎంచుకుంటున్నాడు. తాజాగా సింహా కోడూరి హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇందులో తమిళ సీనియర్ నటుడు సముతిరకని కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. సింహా కెరీర్ లో మూడవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “దొంగలున్నారు జాగ్రత్త” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సతీష్ త్రిపుర అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Read Also : హారర్ మూవీ ఫస్ట్ లుక్ తో హీట్ పెంచేస్తున్న జాక్వెలిన్

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-