త‌గ్గేది లేదంటున్న ట్రంప్‌… ఫిబ్ర‌వ‌రి 21 న ట్రూత్ లాంచ్‌…

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ప‌లు సోష‌ల్ మీడియా సంస్థ‌లు బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే.  అమెరికా క్యాసిట‌ల్ హౌస్ ఘ‌ట‌న త‌రువాత డోనాల్డ్ ట్రంప్ సోష‌ల్ అకౌంట్స్‌ను బ్యాన్ చేశాయి.  దీంతో ట్రంప్ సోష‌ల్ మీడియాకు దూరంగా ఉన్నారు.  అయితే, ఆయ‌నే ఇప్పుడు సొంతంగా సోష‌ల్ మీడియా యాప్‌ను లాంచ్ చేయ‌బోతున్నారు.  ట్రూత్ పేరుతో సోస‌ల్ మీడియా యాప్‌ను ట్రంప్ కంపెనీ రూపొందించింది.  ఇందులో ట్రెండింగ్ టాపిక్స్‌, ట్యాగింగ్ ఆప్ష‌న్లు ఉన్నాయి.  ట్రూత్ యాప్‌ను యూఎస్ ప్రెసిడెంట్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 21 వ తేదీన లాంచ్ చేయ‌బోతున్నారు.  ట్విట్ట‌ర్, ఫేస్ బుక్ సంస్థ‌ల‌కు పోటీగా ట్రంప్ ఈ యాప్‌ను లాంచ్ చేస్తున్నారు.  ట్రూత్ యాప్ ద్వారా త‌న‌ను వ్య‌తిరేకించిన వారిపై బ‌దులు తీర్చుకోబోతున్నారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి అధ్య‌క్షుడిగా పోటీ చేసేందుకు ఈ యాప్ ట్రంప్‌కు సహాయ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  

Read: బ్రేకింగ్: మహేష్ బాబు ఇంట్లో విషాదం..

Related Articles

Latest Articles